Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి
ఈ వార్తాకథనం ఏంటి
జూలై నెలలో జగదీప్ ధన్‌కర్ అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలను తప్పుకోవడానికి ఉద్దేశిస్తూ ధన్‌కర్ రాష్ట్రపతికి లేఖ రాశారు. అనూహ్య నిర్ణయంపై అనేక ఆరోపణలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ధన్‌కర్ రాజీనామా చేశారంటూ విపక్ష నాయకులు ఆరోపించారు. ఇక ఆయన ఆచూకీ కనిపించకపోవడంతో రకరకాల కథనాలు పత్రికల్లో వెల్లువెత్తాయి. అయితే, రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. దీని ద్వారా అనుమానాలు తొలగిపోయాయి. తాజాగా ధన్‌కర్ వార్తల్లో మరోసారి నిలిచారు, ఈసారి ట్విస్ట్ లేకుండా, పబ్లిక్ లైఫ్‌లో కనిపించారు.
Details
బీజేపీ ప్రోటోకాల్ పాటించడం లేదు : దిగ్విజయ్ సింగ్
భోపాల్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య రాసిన పుస్తకం ఆవిష్కరించారు. ధన్‌కర్ ప్రసంగంలో ఈ పుస్తకం మన గత వైభవానికి అద్దం. ఇది నిద్రపోతున్న వారిని మేల్కొల్పుతుంది. మన సాంస్కృతిక విలువల గురించి అవగాహన కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ పర్యటనలో ధన్‌కర్‌కు అధికారుల నుంచి ఎలాంటి మర్యాదలు లభించలేదు. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం లేదా రాష్ట్ర బీజేపీ ఎవరూ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలకలేదు. దీన్ని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతికి సంబంధించిన ప్రొటోకాల్‌ను బీజేపీ పాటించడం లేదని, "యూజ్ అండ్ త్రో విధానం" అనుసరిస్తున్నారని అన్నారు.