Loading...
Four Army aircraft, one highway: జాతీయ రహదారిపై నాలుగు విమానాలు.. భారత సైన్యం అరుదైన ప్రయోగం!
జాతీయ రహదారిపై నాలుగు విమానాలు.. భారత సైన్యం అరుదైన ప్రయోగం!

Four Army aircraft, one highway: జాతీయ రహదారిపై నాలుగు విమానాలు.. భారత సైన్యం అరుదైన ప్రయోగం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యం మరో అరుదైన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. జాతీయ రహదారులను అత్యవసర సమయాల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించింది. ఇందులో భాగంగా తొలిసారిగా నాలుగు మైక్రోలైట్ విమానాలతో జాతీయ రహదారిపై ల్యాండింగ్, టేకాఫ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్‌లోని అమృత్‌సర్‌-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌లో భాగమైన NH-754Aపై ఈ విన్యాసం నిర్వహించింది. భారత సైన్యం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మధ్య సమన్వయానికి ఈ ప్రయోగం నిదర్శనంగా నిలిచింది. భారత సైన్యానికి చెందిన 'టీమ్ మౌంటైన్ ఈగిల్స్' ఈ కార్యక్రమంలో పాల్గొంది.

వివరాలు 

తొలిసారిగా నాలుగు విమానాలతో ల్యాండింగ్, టేకాఫ్

ఈ విన్యాసంలో రెండు ఫిక్స్‌డ్ వింగ్ మైక్రోలైట్ విమానాలు, రెండు పవర్డ్ హ్యాంగ్ గ్లైడర్లను ఉపయోగించారు.

గుజరాత్‌లోని కచ్ జిల్లా కాండ్లా విమానాశ్రయం నుంచి బయలుదేరిన నాలుగు విమానాలు.. పటాన్ జిల్లాలోని సంతల్పూర్ తాలూకాలో బకుత్రా టోల్ ప్లాజా సమీపంలోని జాతీయ రహదారిపై దిగాయి.

అనంతరం అక్కడే విమానాలకు ఇంధనం నింపి తిరిగి టేకాఫ్ తీసుకున్నాయి.

జాతీయ రహదారిపై 946 నుంచి 949 కిలోమీటర్ల మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై ఒకేసారి నాలుగు విమానాల బృందంతో ల్యాండింగ్ నిర్వహించడం, అక్కడే ఇంధనం నింపి తిరిగి టేకాఫ్ చేయడం ఇదే తొలిసారి.

వివరాలు 

నితిన్ గడ్కరీ అభినందనలు

భారత సైన్యం, NHAI, స్థానిక అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

విమానాల రాకపోకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు.

ఈ ప్రయోగంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. విన్యాసానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

భారత సైన్యం, NHAI సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం చారిత్రాత్మకమని అభివర్ణించారు.

దేశంలోని జాతీయ రహదారులు కేవలం ప్రజల రవాణా అవసరాలకే పరిమితం కావని, అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాల వ్యూహాత్మక, కార్యాచరణ అవసరాలకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

నితిన్ గడ్కరీ అభినందనలు

అంతేకాకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, సంబంధిత విభాగాల మధ్య సమన్వయం ఉంటే పర్యాటకం, ఏరో అడ్వెంచర్ కార్యకలాపాల కోసం కూడా జాతీయ రహదారులను వినియోగించుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ ప్రయోగంతో అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను ప్రత్యామ్నాయ విమాన ల్యాండింగ్ కేంద్రాలుగా ఉపయోగించుకునే అవకాశాలపై మరో ముందడుగు పడింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైవేపై ల్యాండింగ్,టేకాఫ్.. భారత సైన్యం సరికొత్త ప్రయోగం

ADVERTISEMENT