
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
కొలీజియం సిఫార్సు చేసిన వారిలో హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయీ మండవ/ కిరణ్మయీ కనపర్తి, సుమతి జగడం, న్యాపతి విజయ్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియానికి సిఫార్సు చేశారు.
ఈ సిఫార్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా అంగీకరించారు.
నలుగురు న్యాయవాదుల యోగ్యతను అంచనా వేసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం, ఈ ప్రతిపాదనకు ఇప్పుడు ఆమోదం తెలిపింది.
ఏపీ
ఏపీ హైకోర్టులో ఉన్నది 27 మంది జడ్జిలే..
హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, న్యాపతి విజయ్‌లపై ఎలాంటి ప్రతికూల నివేదికలు లేవని కొలీజియం వెల్లడించింది.
న్యాయవాది సుమతి జగడంపై కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ, కొలీజియం వాటికి సిపుచ్చింది. ఆమె న్యాయమూర్తిగా నియామకానికి తగిన వ్యక్తిగా కొలీజియం పేర్కొంది.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాలి.
కాని ఇప్పుడు ఏపీ హైకోర్టు కేవలం 27 మంది న్యాయమూర్తులతో మాత్రమే పని చేస్తోంది.
దీంతో న్యాయమూర్తుల భర్తీపై కొలీజియం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్తగా నలుగురు న్యాయవాదులను కొలీజియం జడ్జిలుగా సిఫార్సు చేసింది.