Page Loader
ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన
ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

వ్రాసిన వారు Stalin
Mar 28, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే గర్భిణీ మంగళవారం నలుగురు శిశువులను ప్రసవించింది. అందులో ముగ్గురు అబ్బాయిలు కాగా, ఒకరు అమ్మాయి ఉన్నారు. నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఒకే కాన్పులో నలుగురిని ప్రసవించడం అనేది చాలా అరుదైన సంఘనటగా డాక్టర్లు చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

శిశువులు 1 కిలోగ్రాము చొప్పున బరువు ఉన్నారని వెల్లడించారు. వీరిని ఇంక్యుబేటర్‌లో పరిశీలన నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలానికి చెందిన కిషన్ భార్య గుత్తెముక్కల లావణ్య ఎనిమిది నెలల గర్భంతో సోమవారం ఆసుపత్రికి వచ్చిందని డాక్టర్ శంకర్, డాక్టర్ అఖిల తెలిపారు. ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్యులు నెలలు నిండకుండానే ప్రసవం చేశారు. లావణ్యకు ఇది రెండో కాన్పు. మొదటి కాన్పులో లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చింది.