Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
విశాఖపట్టణం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై ఉన్న పడాలమ్మ తల్లి దేవాలయం సమీపంలో నలుగురిపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైవేపై పంక్చర్ అయిన లారీ టైర్‌ను మారుస్తున్న క్రమంలో ఇద్దరు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్‌పై బస్సు వేగంగా వచ్చి దూసుకెళ్లింది. అయినా డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు కదిలాడు.
అదే సమయంలో పడాలమ్మ తల్లి ఆలయంలో పూజల కోసం వచ్చిన మరో మరో వ్యక్తిని కూడా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కాకినాడ
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరు వద్ద పోలీసులు బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
ఇద్దరు డ్రైవర్లు ప్రసాద్, నాగయ్య, క్లీనర్ కిషోర్ బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
విశాఖపట్నంకు చెందిన లోవరాజు గత ఐదేళ్లుగా పడాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి వైవేధ్యం పెడుతున్నట్లు చెప్పారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతామని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ షేక్ షబ్నం తెలిపారు.