Page Loader
ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి
వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 18, 2023
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫాక్స్‌కాన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు రెడీ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కంపెనీ ప్రతినిధి వీలీ, మోదీ ప్రభుత్వ నిర్ణయాలతో ఫాక్స్‌కాన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. భారతదేశంలో ఉద్యోగ, ఉపాధి, ఎఫ్‌డిఐ, వ్యాపారాన్ని రెట్టింపు చేసేందుకు వచ్చే ఏడాది మీకు గొప్ప పుట్టినరోజు బహుమతిని అందించేందుకు మరింత కష్టపడి పని చేస్తామన్నారు. రానున్న 12 నెలల్లో దేశంలో పెట్టుబడులు, శ్రామిక శక్తిని రెట్టింపు చేయాలని కంపెనీ యోచిస్తోంది. తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్ ప్రస్తుతం, ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ, సరఫరాదారుగా కొనసాగుతోంది.

DETAILS

చైనా నుంచి వైదొలగనున్న ఫాక్స్‌కాన్ కంపెనీ

చైనా నుంచి ప్రస్తుతం ఈ తైవాన్ కి చెందిన కంపెనీ వైదొలగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్ లో వేగంగా విస్తరించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు స్పందించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, కంపెనీ ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీకి సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వీలీ ప్రకటనతో భారత్‌లో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు భారీ స్థాయిలో పెరగనున్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ తమిళనాడులో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా, దాదాపు 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆగస్టులో రెండు కీలకమైన ప్రాజెక్టుల కోసం ఫాక్స్‌కాన్ 600 మిలియన్ డాలర్లను కర్ణాటకలో ప్రకటించింది. ఐ ఫోన్లు, చిప్-మేకింగ్ పరికరాల కోసం కేసింగ్ భాగాలను తయారీపై దృష్టి పెట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీ లీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్