AP cabinet: చేనేత, పవర్ లూమ్ రంగాలకు ఉచిత విద్యుత్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలిపింది.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
అలాగే, రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది.
ఎస్సీ వర్గీకరణ అంశంపైనా భేటీలో చర్చ జరగగా, ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Details
కేబినెట్‌లో తీసుకున్న ముఖ్యమైన విషయాలివే
నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు ప్రణాళికలకు ఆమోద ముద్ర వేసింది.
వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులను భర్తీ చేయడానికి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగం పొందనున్నాయి.