తదుపరి వార్తా కథనం
Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం.. టీ చేసిన సీఎం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 01, 2024
02:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించారు.
మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేసి, స్టవ్ వెలిగించి టీ తయారు చేసి ఆ కుటుంబంతో కలసి మాట్లాడారు.
ఆపై, మరో లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఒంటరి మహిళకు పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి అందిస్తామని హామీ ఇస్తూ, రేపటి నుంచే పనులు ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
ఆయన తో పాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.