LOADING...
Nimisha Priya: నిమిష ప్రియకు విముక్తి కల్పించండి.. యెమెన్‌ వెళ్లిన కుటుంబ సభ్యులు!
నిమిష ప్రియకు విముక్తి కల్పించండి.. యెమెన్‌ వెళ్లిన కుటుంబ సభ్యులు!

Nimisha Priya: నిమిష ప్రియకు విముక్తి కల్పించండి.. యెమెన్‌ వెళ్లిన కుటుంబ సభ్యులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya)ను రక్షించేందుకు భారత్ ప్రభుత్వం పటిష్టమైన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె విడుదల కోసం నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్‌కు చేరుకున్నారు. ఇటీవల ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) ఓ వీడియోను విడుదల చేశారు. అందులో, నిమిష ప్రియ భర్త థామస్, కుమార్తె మిషెల్ యెమెన్ ప్రభుత్వానికి అభ్యర్థనలు తెలియజేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో పాల్‌, వారితో కలిసి కనిపించారు. మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసినందుకు థామస్ అక్కడి హూతీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వీడియోలో డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైనదని వ్యాఖ్యానించారు.

Details

మరణశిక్ష వాయిదా

అంతర్యుద్ధంతో తీవ్రంగా ప్రభావితమైన యెమెన్‌లో శాశ్వత శాంతి సాధించేందుకు తాను మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా, నిమిష ప్రియను విడుదల చేయాలని కూడా ఆయన అక్కడి అధికారులను కోరారు. యెమెన్‌ జాతీయుడు తలాల్‌ అదిబ్‌ మెహది హత్య కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష విధించింది. అయితే భారత్ ప్రభుత్వం, బాధిత కుటుంబం ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం సాధించేందుకు సమయం ఇవ్వాలంటూ యెమెన్‌ను రిక్వెస్ట్ చేసింది. దాంతో జూలై 16న అమలయ్యేలా ఉన్న మరణశిక్షను వాయిదా వేశారు.

Details

కేఏ పాల్ పర్యటనపై ఎటువంటి ప్రకటన చేయని విదేశాంగ శాఖ

అయితే మృతుని కుటుంబం మాత్రం ఆమెకు తప్పకుండా శిక్ష పడాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం నిమిష ప్రియ అంశం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. డాక్టర్ కేఏ పాల్ పర్యటనపై భారత విదేశాంగ శాఖ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయనకి ఉన్న అంతర్జాతీయ పరిచయాల వల్లే యెమెన్‌లోకి వెళ్లగలిగినట్టు సమాచారం. ఇది క్రమంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ అంశం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న కేఏ పాల్