LOADING...
New Year: నూతన సంవత్సరం వేడుకల్లో: మద్యం సేవించిన వారికి ఉచిత రైడ్!
నూతన సంవత్సరం వేడుకల్లో: మద్యం సేవించిన వారికి ఉచిత రైడ్!

New Year: నూతన సంవత్సరం వేడుకల్లో: మద్యం సేవించిన వారికి ఉచిత రైడ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంలో మద్యం సేవించిన వారికి ఉచిత రవాణా సౌకర్యం అందించనున్నట్టు తెలంగాణ గిగ్ & ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది. ఈ సేవ ఈరోజు (డిసెంబర్ 31) రాత్రి 11 గంటల నుండి రాత్రి 1 గంట వరకు అందించబడనుందని వివరించింది. ఈ కార్యక్రమానికి క్యాబ్‌లు, ఆటోలు, ఈ-వీ బైక్‌లను కలిపి మొత్తం 500 వాహనాలు ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు యూనియన్ పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో ఈ ఉచిత రైడ్ సౌకర్యం లభిస్తుందని తెలిపారు. ఉచిత రైడ్ పొందేందుకు 8977009804 నంబర్‌కు కాల్ చేయాలని టీజీపీడబ్ల్యూయూ ప్రజలకు సూచించింది.

Advertisement