LOADING...
Rivaba Jadeja: క్రికెటర్ భార్య నుండి గుజరాత్ మంత్రి వరకూ.. ట్రెండింగ్ లో రివాబా జడేజా!
క్రికెటర్ భార్య నుండి గుజరాత్ మంత్రి వరకూ.. ట్రెండింగ్ లో రివాబా జడేజా!

Rivaba Jadeja: క్రికెటర్ భార్య నుండి గుజరాత్ మంత్రి వరకూ.. ట్రెండింగ్ లో రివాబా జడేజా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతంలో ఎక్కువగా ప్రసిద్ధి పొందకపోయినా, రివాబా జడేజా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యగా పరిచయం అయిన రివాబా తాజాగా గుజరాత్ మంత్రివర్గ విస్తరణలో ప్రమాణస్వీకారం చేసి మంత్రిగా ఎంపిక కావడంతో మీడియా హైలైట్ అయ్యారు. రివాబా జడేజా నవంబర్ 2, 1990న రాజ్‌కోట్‌లో హర్దేవ్‌సిన్హ్-ప్రఫుల్లబా సోలంకి దంపతుల ఇంట్లో జన్మించారు. రాజ వంశానికి చెందిన రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన ఆమెకు రాజకీయ పరిచయం కూడా ఉంది. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు హరి సింగ్ సోలంకికి బంధువు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. మహిళా సంక్షేమం, సాధికారతపై దృష్టి పెట్టే 'శ్రీ మాతృశక్తి ఛారిటబుల్ ట్రస్ట్' అనే ఎన్జీవోను స్థాపించారు.

Details

2019లో రాజకీయ ప్రయాణం స్టార్ట్

2016లో క్రికెటర్ రవీంద్ర జడేజాతో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ పార్టీలో అడుగు పెట్టారు. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సమయంలో రివాబా జడేజా ప్రజల మద్దతు పొందింది. రాజకీయాల్లోకి రాకముందు రాజ్‌పుత్ సంస్థ కర్ణి సేనతో సంబంధం కూడా కలిగి ఉన్నారు. 2027లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా, రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. ఈ ఘటనా వల్ల ఆమె ట్రెండింగ్‌లోకి చేరారు.