LOADING...
Bangalore: మసాలా దోసె నుంచి బిర్యానీ వరకు.. బెంగళూరులో ఫుడ్ రేట్లకు రెక్కలు
మసాలా దోసె నుంచి బిర్యానీ వరకు.. బెంగళూరులో ఫుడ్ రేట్లకు రెక్కలు

Bangalore: మసాలా దోసె నుంచి బిర్యానీ వరకు.. బెంగళూరులో ఫుడ్ రేట్లకు రెక్కలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరు లో బయట భోజనం చేయడం త్వరలోనే మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నగరంలోని హోటల్ సంఘాలు ఆహార పదార్థాల ధరలు రాబోయే నెలల్లో 60 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. కనీస వేతనాల పెంపు, ఇంధన ధరల నిరంతర పెరుగుదల ఈ ధరల భారానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సుమారు రూ.80కి లభిస్తున్న మసాలా దోసె ధర త్వరలోనే రూ.150 వరకు చేరవచ్చని హోటల్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుతం రూ.300 నుంచి రూ.350 మధ్య ఉన్న ఒక ప్లేట్ బిర్యానీ ధర దాదాపు రూ.500కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు

యజమానులపై ఆర్థిక భారం

సాధారణంగా రూ.50 ప్రాంతంలో లభించే ఇడ్లీ ధర కూడా వేతనాల సవరణ తర్వాత రూ.80 దాటవచ్చని సమాచారం. కర్ణాటక రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు జీకే శెట్టి మాట్లాడుతూ, బెంగళూరులో బయట భోజనం చేయడం గణనీయంగా ఖరీదైన వ్యవహారంగా మారబోతోందని తెలిపారు. ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 మధ్య ఉన్న వెజిటేరియన్ మీల్స్ ధరలు కూడా రూ.250 నుంచి రూ.300 వరకు పెరగవచ్చని పేర్కొన్నారు. హోటల్ యజమానులపై ఆర్థిక భారం రోజురోజుకూ పెరుగుతోందని శెట్టి వివరించారు. బెంగళూరులో నైపుణ్యం లేని కార్మికుడికి సవరించిన కనీస వేతనం రూ.23 వేలకుపైగా ఉండే అవకాశం ఉందన్నారు.

వివరాలు

వ్యాపారలను నిర్వహించడం కష్టమవుతోంది

దీనికి ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు, ఆహారం, వసతి, యూనిఫామ్ ఖర్చులు కలిపితే ఒక్కో ఉద్యోగిపై మొత్తం వ్యయం దాదాపు రూ.36 వేల వరకు చేరుతోందని వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హోటల్ యజమానులు ధరలు పెంచక తప్పదని, లేదంటే వ్యాపారాలను నిర్వహించడం కష్టమవుతుందని హోటల్ సంఘాలు చెబుతున్నాయి.

Advertisement