Page Loader
Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2024
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,నటుడు చిరంజీవి, తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి వైజయంతిమాల బాలి, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్‌ శౌచాలయ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ (మరణానంతర పురస్కారం) లకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను ప్రదానం చేసినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను కేంద్రం గురువారం విడుదల చేసింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అవార్డులు అందజేస్తారు.

Details 

ఈ ఏడాది ఐదుగురికి  పద్మవిభూషణ్

ఈ ఏడాది ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూషణ్, 110 మంది పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. వీరిలో 30 మంది మహిళలు అవార్డులు పొందారు. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి,ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు 17 మంది పద్మ భూషణ్ అవార్డు గ్రహీతలలో ఉన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో పాప్ మ్యూజిక్ క్వీన్ గా పేరొందిన ఉషా ఉతుప్, నటుడు విజయకాంత్ కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ 19వ గవర్నర్‌గా పనిచేసిన భాజపా సీనియర్‌ నేత రామ్‌నాయక్‌, రాజ్యసభ మాజీ ఎంపీ ఓలంచెరి రాజగోపాల్‌లకు పద్మభూషణ్‌ అవార్డులు దక్కాయి.

Details 

ఇతర పద్మభూషణ్ అవార్డులు:

ఎం ఫాతిమా బీవీ (ప్రజా వ్యవహారాలు) - కేరళ హోర్ముస్జి ఎన్ కామా (సాహిత్యం & విద్య) - మహారాష్ట్ర సీతారాం జిందాల్ (వాణిజ్యం & పరిశ్రమ) - కర్ణాటక అశ్విన్ బాలచంద్ మెహతా (మెడిసిన్) - మహారాష్ట్ర సత్యబ్రత ముఖర్జీ (ప్రజా వ్యవహారాలు) - పశ్చిమ బెంగాల్ తేజస్ మధుసూదన్ పటేల్ (మెడిసిన్) - గుజరాత్ దత్తాత్రే అంబదాస్ మాయలూ అలియాస్ రాజ్‌దత్ (కళ) - మహారాష్ట్ర తోగ్డాన్ రింపోచే (ఇతరులు - ఆధ్యాత్మికత) - లడఖ్ ప్యారేలాల్ శర్మ (కళ) - మహారాష్ట్ర చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (మెడిసిన్) - బీహార్ కుందన్ వ్యాస్ (సాహిత్యం & విద్య - జర్నలిజం) - మహారాష్ట్ర

Details 

పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితా:

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలు పొందినవారిలో ముగ్గురు (డి.ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప)..'అన్‌సంగ్‌ హీరోస్‌' పేరిట విడుదల చేసిన 34 మంది జాబితాలో ఉన్నారు. టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న, స్క్వాష్‌ ప్లేయర్ జోష్న చిన్నప్పలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. క్రీడా రంగం నుంచి మొత్తం ఏడు మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హర్బిందర్ సింగ్ (హాకీ, కోచ్) పూర్ణిమా మహతో (ఆర్చరీ, మాజీ క్రీడాకారిణి) సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్, అథ్లెట్) గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్, కోచ్) ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే (మల్లఖంబ, కోచ్) జోష్నా చినప్ప (స్క్వాష్, అథ్లెట్) రోహన్ మచ్చండ బోపన్న (టెన్నిస్, అథ్లెట్)