Page Loader
Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన
యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన

Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచే అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. అంతేగాక, శాంతి ఏర్పాటుపై మరింత ముందడుగు వేస్తూ.. ఈ నెల 12వ తేదీన పాకిస్తాన్‌ విదేశాంగ శాఖతో ద్వైపాక్షిక శాంతి చర్చలు జరగనున్నాయని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. పరిణామాలను సమర్థంగా ఎదుర్కొంటూ, రెండు దేశాల మధ్య మళ్లీ సామరస్య వాతావరణం నెలకొనేలా చర్చలు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో సరిహద్దుల్లో తాత్కాలికంగా శాంతి నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

Details

కాల్పుల విరమణను అంగీకరించిన పాక్

పాకిస్థాన్, భారత్‌ మధ్య కాల్పుల విరమణపై కీలక ప్రకటన వెలువడింది. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతా (ఇప్పటి "ఎక్స్") ద్వారా ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తక్షణమే అమల్లోకి వస్తుందంటూ ప్రకటన