Page Loader
G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం
G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం

G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 07, 2023
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ వేదికగా అతిపెద్ద శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా G-20 పేరు మోగిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జీ20 సభ్యదేశాల ప్రపంచ అగ్రనేతలు ఇండియాకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా దాదాపు 40కిపైగా దేశాల అధినేతలు హస్తినలోనే శని, ఆదివారాల్లో కలవనున్నారు. జీ7 + బ్రిక్స్‌ + ఈయూ= జీ20 G-20 అంటే 20 దేశాల అధ్యక్షులు, ప్రధానులతో కూడిన అధికారిక బృందం. అయితే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, భారత్‌, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఇటలీ, దక్షిణకొరియా, జపాన్‌,మెక్సికో, బ్రెజిల్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, తుర్కియే, రష్యా, సౌదీ అరేబియా, యూకే సహా ఐరోపా యూనియన్‌(EU)లకూ ఈ కూటమిలో సభ్యత్వాలు ఉన్నాయి.

details

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే మూడు కూటములతో ఏర్పడిందే G-20 

G-20 కూటమి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ, శాసించే మూడు కూటములతో కలసి ఏర్పడిన అతిపెద్ద గ్రూప్. 1. G-7 దేశాల కూటమి : అభివృద్ధి చెందిన G-7 (అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, ఇటలీ, జపాన్‌, కెనెడా), 2. BRICS కూటమి - అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా)లతో పాటు 3. EU- యూరప్ యూనియన్‌లో 27 దేశాలు సభ్యత్వం కలిగి ఉండటం విశేషం. అయితే జీ-7లో భౌగోళిక రాజకీయాలు ఎలా ఉన్నాయి, భద్రతపై ఎలా వ్యవహరించాలనే అంశాలపై దృష్టి సారిస్తుంటుంది. అదే G-20 అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, సవాళ్లు, సమస్యలు, పరిష్కారాలపై కీలకంగా చర్చించడం గమనార్హం.

details

G-20 సభ్యుల కూటమి వాటా 85 శాతం

ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తిలో) G-20 సభ్యుల కూటమి వాటా 85 శాతం కావడం గమనార్హం. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం ఈ కూటమి నుంచే వస్తుంది. 60 శాతానికిపైగా ప్రపంచ జనాభాకు ఈ సదస్సు ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే ఇక్కడ తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత లేదు. కానీ సభ్యదేశాలు వాటిని గౌరవించి, అమలు చేస్తాయి. చైనా రాజకీయం : మరోవైపు జీ-20లో అమెరికా సహా అనేక పాశ్చాత్యదేశాలు సభ్యత్వాలు కలిగినప్పటికీ చైనా మాత్రం క్రమంగా కూటమి ప్రాధాన్యాన్ని దెబ్బతీస్తోందనేది అగ్రరాజ్యం భావిస్తోంది. ఈసారి దిల్లీ సదస్సుకు డ్రాగన్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ రాకుండా తన ప్రతినిధిని పంపించనుండటమే దీనికి ఉదాహరణ.బ్రిక్స్‌ కూటమికే ప్రాధాన్యమిచ్చేందుకు చైనా ఉవ్విళ్లూరుతోందని అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.