28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు
హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నగరంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లో పూజలు అందుకుంటున్నారు. ఈ మేరకు ఈ భారీ గణపతిని సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇతర గణపతుల నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నిమజ్జనాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సెప్టెంబర్ 28 రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు MMTS స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. 11 రోజుల పాటు ఉత్సవాలు అనంతరం 28న గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామివారి శోభాయాత్ర ప్రారంభం కానుంది.