వినాయక చవితి వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; ఈ రూట్లలో 11రోజుల పాటు రెడ్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
వినాయక నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు భద్రతా చర్యలపై హైదరాబాద్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
ఉత్సవాల నిర్వహణకు ఎటువంటి అడ్డు లేకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు భారీ బందోబస్తును సిద్ధం చేశారు.
భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా ఖైరతాబాద్ మహాగణపతి ప్రసిద్ధి చెందారు. ఈ భారీ గజాననా కోసం తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.
భక్తులకు అసౌకర్యం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రాబోయే 11 రోజులు పాటు ట్రాఫిక్ ఆంక్షలున్నాయి.
సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
details
ఉదయం 11నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు
రాజ్‌దూత్ లైన్ - గణేష్ రహదారిపై వాహనాలను అనుమతించరు. రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు ట్రాఫిక్ దారి మళ్లిస్తారు.
రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వరకు ట్రాఫిక్‌కు అనుమతి లేదు.అటుగా వెళ్లే వాహనాలను రాజీవ్ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
మింట్ కాంపౌండ్ నుంచి ఐమ్యాక్స్ వైపు సాధారణ ట్రాఫిక్ ను అనుమతించరు.మింట్ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపునకు మాత్రం వాహనాలను మళ్లిస్తారు.
ప్రతీరోజూ ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.
అసౌకర్యాలకు ట్రాఫిక్ హెల్ప్‌లైన్ - 9010203626లో సంప్రదించాలని స్పష్టం చేశారు.