DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం
ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి గణేష్ పూజ కోసం వెళ్లడం రాజకీయ వివాదానికి కారణమైంది. విపక్షాలు దీనిని తప్పుబడుతూ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆరోపించాయి. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సహా పలువురు నేతలు ఈ భేటీపై విమర్శలు చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇది అడ్డుపడుతుందనే సందేహాలను వ్యక్తం చేశారు. శివసేన కేసు విచారణ జరగడం వాయిదా పడుతుండడంతో, ఈ భేటీకి అనుమానాలు కలుగుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దీనికి బీజేపీ నుండి ప్రతిస్పందన కూడా వచ్చింది. గతంలోనూ న్యాయమూర్తులు, రాజకీయ నేతలు కలిసి పూజలలో పాల్గొన్న సందర్భాలను ప్రస్తావించారు. గణేష్ పూజ నేరం కాదని వారు ప్రశ్నించారు.