LOADING...
Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం 
యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం

Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2024
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కోల్‌కతా, బద్లాపూర్ ఘటనలూ మరువకముందే, తాజాగా యూపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామంలో ఇద్దరి విద్యార్థినులను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి, అడవుల్లో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన వారిలో అనస్, షాదాబ్ మరొక ఇద్దరు ఉన్నారు.

Details

నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

బాలికలు ఇంటికి రాకపోవడంతో, వారి తండ్రి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలోనే బాధితులు చంద్రీదీప్ ఘాట్ సమీపంలోని అడవిలో కనిపించారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు నలుగురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. షాదాబ్, అనాస్‌ను అరెస్ట్ చేయగా మరొ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని విద్యార్థినులపై అత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు.