
USA: పంజాబ్‌లో 14 గ్రెనేడ్ దాడులకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా.. అమెరికాలో అరెస్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్ననేరస్తుల్లో ఒకరైన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా అమెరికాలో పట్టుబడ్డాడు.
అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్టు ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది.
పంజాబ్‌లో గత ఏడాది కాలంలో జరిగిన 16 గ్రనేడ్ దాడుల్లో 14 ఘటనలకు హ్యాపీ పాసియానే ప్రధాన ఆరోపితుడిగా గుర్తించబడ్డాడు.
ఈ దాడులు ముఖ్యంగా పోలీస్ చెక్‌పోస్టులు, ప్రార్థనా మందిరాలు, ప్రముఖుల నివాసాలపై జరిగినవిగా గుర్తించబడినాయి.
ఇటీవలి కాలంలో జరిగిన ఒక ఘటనలో భారతీయ జనతా పార్టీ నేత మనోరంజన్ కాలియా ఇంటిపై కూడా గ్రనేడ్ దాడి జరిగింది.
ఈ సంఘటనలన్నింటిపై దర్యాప్తు చేయగా, హ్యాపీ పాసియా పాత్ర స్పష్టంగా బయటపడింది.
వివరాలు
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురిపై ఎన్‌ఐఏ కేసులు నమోదు
2024 ప్రారంభంలో, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురిపై ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసింది.
ఇందులో హ్యాపీ పాసియాతో పాటు,పాకిస్తాన్‌కు చెందిన హర్వీందర్ సింగ్ సంధూ అలియాస్ రిండా పేరు కూడా ఉంది.
ఈ దాడులకు హ్యాపీ పాసియా,రిండానే పూనీధులు అని దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ దాడుల నిర్వహణ కోసం రోహన్ మిషా, విశాల్ మిషా అనే వ్యక్తులను నియమించి, దాడులు చేయించినట్లు సమాచారం.
వివరాలు
హ్యాపీ పాసియాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
2024 జనవరి 22న ఛండీగఢ్‌లో జరిగిన గ్రనేడ్ దాడికి సంబంధించి ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మొత్తం 16 చోట్ల ఎన్‌ఐఏ ఒకేసారి సోదాలు నిర్వహించింది.
అంతేకాకుండా, మాజీ పోలీసు అధికారి జేఎస్ చాహల్ నివాసంపై జరిగిన దాడి కేసులో హ్యాపీ పాసియాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.
ఈ దాడికి అవసరమైన పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ఆర్థిక సహాయాన్ని హ్యాపీ పాసియానే సమకూర్చినట్టు దర్యాప్తులో తేలినట్టు పేర్కొంది.