గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు
అవధేష్ రాయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. అన్సారీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. సెక్షన్ 145, 302 అతన్ని దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని న్యాయవాది వికాష్ సింగ్ చెప్పారు. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నాయకుడు అజయ్‌రాయ్ స్పందిస్తూ.. 'ఈరోజు 32 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గెలిచాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, నాకు ఏమైనా జరిగితే ఆ బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే' అని పేర్కొన్నారు. అజయ్‌రాయ్ ఇంటి ముందే అవధేష్ రాయ్ ఈ హత్య జరిగింది.
ఆగస్ట్ 3, 1991న అవధేష్ రాయ్ హత్య
ఆగస్ట్ 3, 1991న కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ వారణాసిలోని దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో ముఖ్తార్ అన్సారీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మే 19న వాదనల అనంతరం విచారణను ముగించిన ప్రత్యేక న్యాయస్థానం, తన తీర్పును రిజర్వులో ఉంచింది. జూన్ 5న శిక్షను ఖరారు చేసింది. అవధేష్ రాయ్ హత్య కేసులో, అజయ్ రాయ్, ముఖ్తార్ అన్సారీ, భీమ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ ప్రాంతంలో హత్యాయత్నానికి కుట్ర పన్నిన మరో కేసులో నిందితులుగా ఉన్న ముఖ్తార్ అన్సారీని మే 17న ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.