Hyderabad: హైదరాబాద్ రోడ్లపై మళ్లీ చెత్త డబ్బాలు!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరాన్ని చెత్త రహితంగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం గార్బేజ్ బిన్లను తొలగించినా నగరంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.
రోడ్లపైనే చెత్తకుప్పలు పేరుకుపోతుండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ చెత్త డబ్బాలను తిరిగి ఏర్పాటు చేయనుంది.
ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త ఊహించని స్థాయిలో పేరుకుపోతోంది. ముఖ్యంగా తరచూ చెత్త వేసే జీవీపీ పాయింట్ల తొలగింపులో జీహెచ్‌ఎంసీ విఫలమైంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రేటర్ రోడ్లపై మళ్లీ డంపర్ బిన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లలో మొత్తం 1000 డంపర్ బిన్లను కొనుగోలు చేశారు.
Details
డంపర్ బిన్ల తిరిగి ఏర్పాటు - ప్రధాన మార్పులు
చార్మినార్ జోన్‌లో 115, ఖైరతాబాద్ జోన్‌లో ఆరు ప్రాంతాల్లో స్మార్ట్ బిన్లను ఏర్పాటు.
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా డస్ట్‌బిన్ ఫ్రీ సిటీగా మార్పు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించినా, ప్రస్తుత పరిస్థితుల కారణంగా మళ్లీ చెత్త డబ్బాలను తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.
గతంలో రోడ్ల వెంట 800కి పైగా చెత్త డబ్బాలను తొలగించినా, పెరిగిన జనాభా, చెత్త ఉత్పత్తికి అనుగుణంగా తరలింపు వాహనాలను పెంచిన జీహెచ్‌ఎంసీ.
వీధి వ్యాపారులు తప్పనిసరిగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన అమలులో ఉంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో మార్కులు తగ్గే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, మళ్లీ డంపర్ బిన్లను ఏర్పాటు చేయడం గమనార్హం.