Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్.. ఇంజక్షన్ ధర రూ.20వేలు
ఈ వార్తాకథనం ఏంటి
గులేరియా బాలి సిండ్రోమ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.
ఇది ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు జీజీహెచ్‌లలో చికిత్స పొందుతున్నారు.
ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన ఇంజక్షన్ పేరు ఇంట్రా వీనస్ ఇమ్యునో గ్లోబిన్. ఈ ఇంజక్షన్లు చాలా ఖరీదైనవి,
ఒక్కొక్కటి రూ.20,000 ధర ఉంటుందని, ఒక్కో పేషెంట్ కు రోజుకు ఐదు ఇంజక్షన్లు అవసరమవుతాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వివరించారు.
Details
ఐదురోజుల చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు
రోజుకు ఒక లక్ష రూపాయలు, ఐదురోజులకు ఐదు లక్షలు ఖర్చవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ఖర్చుతో కూడుకున్న చికిత్స కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తున్నారని, ఈ ఇంజక్షన్లను ఎన్టీఆర్ వైద్యసేవలో కూడా చేర్చినట్లు మంత్రి చెప్పారు.
ప్రస్తుతం జీజీహెచ్‌లలో 740 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి.
అలాగే గోడౌన్లలో 429 ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయని ఆయన తెలిపారు.