LOADING...
Belum Caves: భౌగోళిక వారసత్వ ప్రదేశంగా బెలూం గుహలు..జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపు
జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపు

Belum Caves: భౌగోళిక వారసత్వ ప్రదేశంగా బెలూం గుహలు..జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ గుర్తింపుతో బెలూం గుహలు భారతదేశంలోని ప్రాముఖ్యమైన పర్యాటక ప్రాంతాల జాబితాలో స్థానం సంపాదించాయి. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా ఈ గుహల ప్రచారానికి మరింత బలపడనుంది. దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే బెలూం గుహలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రతి సంవత్సరం సుమారుగా రెండు లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తున్నారు.