Page Loader
Jyoti Malhotra: 'గెట్ మీ మ్యారీడ్': 'లీక్ అయిన జ్యోతి మల్హోత్రా చాటింగ్‌!
'గెట్ మీ మ్యారీడ్': 'లీక్ అయిన జ్యోతి మల్హోత్రా చాటింగ్‌!

Jyoti Malhotra: 'గెట్ మీ మ్యారీడ్': 'లీక్ అయిన జ్యోతి మల్హోత్రా చాటింగ్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విచారణ కొనసాగుతుండగా, మరికొన్ని సంచలనాత్మక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకునేందుకు ముందుగా అంగీకరించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో, పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు కలిగిన హసన్ అనే వ్యక్తితో ఆమె జరిపిన సంభాషణల వివరాలు తాజాగా బయటపడ్డాయి. అలీ హసన్ అనే వ్యక్తితో జ్యోతి మల్హోత్రా తరచూ సంప్రదింపులో ఉండినట్లు తెలుస్తోంది. వారి మధ్య మాట్లాడుకున్న చాటింగ్‌ కోడ్ భాషలో ఉండటంతో వాటిని అర్థం చేసుకునేందుకు అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని సంభాషణలు బయటపడగా,అవి ఆమె తన పెళ్లిని పాకిస్థాన్‌లోనే జరుపుకోవాలనుకున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వివరాలు 

దుబాయ్‌ నుంచి జ్యోతి ఖాతాకు డబ్బులు బదిలీ

అంతేకాకుండా,భారతదేశంలోని రహస్య సమాచారం గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. అదనంగా,జ్యోతికి నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని,వాటిలోకి దుబాయ్‌ నుంచి డబ్బులు బదిలీ అవుతున్నాయని దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. ఈవిషయంపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా,పర్యాటక విషయాలపై వీడియోలు చేస్తూ ట్రావెల్ బ్లాగర్‌గా గుర్తింపు పొందింది. 2023లో ఆమె పాకిస్థాన్‌కి వెళ్లిన సమయంలో డానిష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత కూడా ఆమె అతనితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసులు ధృవీకరించారు. డానిష్ సూచన మేరకే ఆమె అలీ అనే వ్యక్తిని కలిసినట్లు తెలిసింది.అలీ ఆమెను పాక్‌కు చెందిన నిఘా,రక్షణ విభాగాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయం చేశాడని సమాచారం.

వివరాలు 

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం లీక్  

ఆమె దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశారన్న అనుమానంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాక, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత అధికారులు ఇప్పటికే నిలిపివేసినట్లు సమాచారం. పైగా, పాక్ హైకమిషన్‌కు చెందిన వ్యక్తితో ఆమె జరిపిన వివాహ చర్చల చాటింగ్‌ వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి.