LOADING...
Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య

Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి మొదట తన భార్యను తుపాకీతో కాల్చి హతమార్చి, అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని జీవితం ముగించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి తన నిర్ణయానికి కారణాలు పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. మీరట్‌కు చెందిన కుల్దీప్ త్యాగి అనే వ్యక్తి తన భార్య నిషు త్యాగిని తుపాకీతో కాల్చి చంపిన అనంతరం తానే తనపై కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన బుధవారం ఘజియాబాద్‌లో చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

 ఘటనసమయంలో ఇంట్లోనే తండ్రి,ఇద్దరు పిల్లలు

ఆసూసైడ్ నోట్‌లో కుల్దీప్ తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నానని,ఆరోగానికి జరుగుతున్న చికిత్స ఖర్చులు కుటుంబానికి భారంగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని పేర్కొన్నాడు. భార్యకు జీవితాంతం తోడుగా ఉంటానని ఇచ్చిన మాట నెరవేర్చాలనే భావనతోనే ఆమెనుచంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డానని నోట్లో రాశాడు. క్యాన్సర్ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని,మానసికంగా తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని కూడా వెల్లడించాడు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఘటనసమయంలో కుల్దీప్ తండ్రి,అతని ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఇది హత్యతో పాటు ఆత్మహత్య సంఘటనగా పరిగణిస్తూ విచారణ కొనసాగిస్తున్నామని ఏసీపీ మిశ్రా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని,ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.