Page Loader
Telangana: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
Telangana: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

Telangana: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

వ్రాసిన వారు Stalin
Mar 30, 2024
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలనం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు ఎఐసీసీ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, కొద్దిరోజులుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. విజయలక్ష్మీ తండ్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు కూడా రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నారు. మరో సీనియర్ నే త స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన కూతురుతోపాటు కాంగ్రెస్ లో చేరనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి