బొట్టు పెట్టుకుని స్కూలుకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
జార్ఖండ్ ధన్‌బాద్ పట్టణంలోని ఓ తరగతి గదిలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్మాదిలా వ్యవహరించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు స్థానిక పోలీసులు వెల్లడించారు. హిందూ సాంప్రదాయం మేరకు నుదుటిన బొట్టు పెట్టుకుని ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లింది. బొట్టును గమనించిన పాఠశాలలోని ఓ టీచర్ సదరు విద్యార్థినిపై విరుచుకుపడ్డాడు. ఇదే విషయాన్ని మృతురాలు సూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు గుర్తించారు. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడటంపై మృతురాలి తల్లిదండ్రులు,స్థానికులు పాఠశాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనంతరం యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ ఉత్తమ్ ముఖర్జీ తెలిపారు.