తదుపరి వార్తా కథనం

Bandi Sanjay: గ్రూప్-1 పై నివేదిక ఇవ్వండి.. టీజీపీఎస్సీకి బండి సంజయ్ లేఖ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 30, 2025
04:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రమంత్రి బండి సంజయ్ గ్రూప్-1 వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ నియామక మండలి (టీజీపీఎస్సీ)ను నిశితంగా సమాధానం ఇవ్వాలని కోరారు.
వారం రోజుల వ్యవధిలో సమగ్ర సమాచారం అందించాలని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్-1 పరీక్షలపై అభ్యర్థుల అభ్యంతరాలు, సందేహాలు లేఖలో స్పష్టంగా ప్రస్తావించారు.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అవినీతి, అక్రమాలు, నిర్వాహక తప్పిదాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు బండి సంజయ్‌ను కలిగి, జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ఆయన, వెంటనే స్పందించి టీజీపీఎస్సీకి అధికారిక లేఖ ద్వారా స్పందన కోరారు.