
Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాశవిక ఘటనతో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి.
దాయాది దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
పాకిస్థాన్ ఎప్పటికీ భారత్‌కు శత్రుదేశమే. అలాంటి దేశంతో మనకు సంబంధాలు అవసరం లేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అనుమతి ఇవ్వగలిగితే.. పాక్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
అంతకుముందు పహల్గాం దాడిని ఖండించిన మంత్రి, ఇది అత్యంత హేయమైన చర్య అని చెప్పారు.
Details
దేశమంతా ఏకమై పోరాడాలి
ఇలాంటి ఉగ్రవాద చర్యలపై దేశం మొత్తం ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
పాక్ భూభాగంపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ అనుమానాలు వ్యక్తం చేశారు. దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఢిల్లీ మంత్రి మజీంద్ సింగ్ సిర్సా ఘాటుగా స్పందిస్తూ, 'మన సైన్యం సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదు. ఆధారాల కోసం అనుకుంటే పాకిస్థాన్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చని విమర్శించారు.
బీజేపీ నుంచి తీవ్ర స్పందన రావడంతో చరణ్‌జీత్ వెనక్కి తగ్గారు. తాను ఆధారాలు అడగలేదని స్పష్టీకరణ ఇచ్చారు. కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు.