
Revanth Reddy: ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు ఇవ్వండి: సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలిచ్చారు.
అర్హులైన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న జిల్లాలను విడిగా ఉంచి, కోడ్ అమలులో లేని జిల్లాల్లో తక్షణమే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు.
Details
రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల వెల్లువ
ఇప్పటికే లక్షల సంఖ్యలో రేషన్ కార్డ్ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ దరఖాస్తులలో కొత్త సభ్యుల కోసం చేసిన దరఖాస్తులే కాకుండా, ఇప్పటికే ఉన్న కార్డులపై కొత్త సభ్యులను చేర్చేందుకు కూడా ఎక్కువసేపు అప్లికేషన్లు వస్తున్నాయి.
ఈ విషయాన్ని అధికారులు సీఎంను తెలియజేసి, ప్రజలకు కొత్తగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.