
షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
ఈ వార్తాకథనం ఏంటి
విహారయాత్రకు గోవాకు వచ్చిన దిల్లీకి చెందిన ఓ కుటుంబంపై కత్తులతో దాడి చేశారు. అంజునా ప్రాంతంలో బీచ్‌కు సమీపంలో ఉండే 'స్పాజియో లీజర్' అనే రిసార్ట్‌లో బస చేసిన వారిపై కొందరు దుండగులు పాశవికంగా దాడి చేశారు. కుటుంబ సభ్యుల్లో జతిన్ శర్మ ఈ సంఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తెలియజేశాడు.
అంతకుముందు కొందరు సిబ్బిందితో గొడవ జరిగిందని, దీంతో వారిపై మేనేజర్‌కు ఫిర్యాదు చేసినట్లు జతిన్ శర్మ పేర్కొన్నారు. సబ్బందిని మేనేజర్ తొలగించినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత కుటుంబ సభ్యలమంతా స్విమ్మింగ్ పూల్ వద్ద సేద తీరుతుండగా, నలుగురు వచ్చి కత్తులతో దాడి చేశారని జతిన్ శర్మ వాపోయారు.
గోవా
దాడిని ఖండించిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ఘటనను ఖండించారు. దీని వెనుక సంఘ విద్రోహ శక్తులున్నాయన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
అనంతరం పోలీసులు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. క్లిప్‌లో దుండగుల బృందం జతిన్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేయడాన్ని చూడవచ్చు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విహారయాత్రకు వచ్చిన కుటంబంపై దాడి చేసిన దృశ్యాలు
Name of Assaulted -Jatin Sharma Anil Sharma
— Jacob Mathew (@Jacobmathewlive) March 12, 2023
Location - Anjuna North Goa#ViralVideo pic.twitter.com/DUkaVOVClA