
గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు గోదావరి జలాలను 87 మీటర్ల నీటిమట్టం స్థాయి నుంచి తీసుకోవడానికే కేంద్ర మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇటీవలే ఎన్‌డబ్య్లూడీఏకు చెందిన ఇంజనీర్ల బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సమ్మక్క-సాగర్ ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే.
అయితే గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు సానకూలతలపై కేత్రస్థాయి పరిశీలన చేసి జాతీయ నీటి అభివృద్ధి సంస్థకు నివేదికను సమర్పించింది.
సమ్మక్క సాగర్ వెనుక జలాల నుంచి 85 మీటర్ల నీటిని తోడి నాగార్జున సాగర్ కు.. అటు నుంచి సోమశిల ద్వారా కావేరి నదికి తరలించాలని బృందం ప్రతిపాదనలను పంపింది. ఈ ప్రతిపాదనను జాతీయ నీటి అభివృద్ధి తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
Details
చత్తీస్‌ఘడ్ ఒప్పుకుంటుందా..?
ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచే తరలించడానికి అంగీకారం తెలిపినట్లు స్పష్టమవుతోంది. గోదావరిలో ఛత్తీస్ ఘడ్ ఆ రాష్ట్ర వాటగా 147 టీఎంసీలను తరలించేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనికి ఆ రాష్ట్రం ఒప్పుకోకపోవడం గమనార్హం.
అదే విధంగా గోదావరిపై 83 మీటర్ల వద్ద తెలంగాణ నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీతో ఏర్పడే ముంపుపైనా ఛత్తీస్ ఘడ్ అంగీకరించడం లేదు. ప్రస్తుతం 87 మీటర్ల వద్ద ఇచ్చంపల్లి నిర్మిస్తే ఆ రాష్ట్రం ఒప్పుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
దగ్గర్లో నిర్వహించే ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఇచ్చంపల్లి వ్యవహరంపై మరోసారి రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొనే అవకాశం ఉంది.