NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dibrugarh Express Accident:  గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో.. 
    తదుపరి వార్తా కథనం
    Dibrugarh Express Accident:  గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో.. 
    గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో..

    Dibrugarh Express Accident:  గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 20, 2024
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గోండా రైలు ప్రమాదంలో వైరల్ అయిన ఆడియో పెద్ద విషయాన్ని వెల్లడించింది. వైరల్ అయిన ఆడియోలో, ట్రాక్ గందరగోళంగా ఉందని, ప్రమాదం ఉందని, జాగ్రత్త అవసరం అని కీమ్యాన్ చెబుతూనే ఉన్నాడు కానీ లోకో పైలట్ పట్టించుకోలేదు.

    ఆ తర్వాత పెద్ద ప్రమాదం జరిగింది. మరోవైపు, ఈ రైలు ప్రమాదం తర్వాత, CRS (కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ) ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.

    అధికారులతో పాటు సీఆర్‌ఎస్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి నుంచి ఆధారాలు సేకరిస్తోంది.

    ట్రాక్ (రైలు మార్గం) నుండి ట్రాక్షన్ వరకు ప్రతిదీ దర్యాప్తు చేస్తారు. ఈ ప్రమాదం ఎప్పుడు, ఎందుకు, ఎలా జరిగిందనే అంశాలన్నింటిపై విచారణ జరిపి రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేస్తుంది.

    వివరాలు 

    ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. 

    గురువారం గోండాలో డిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన తరువాత, నలుగురు ప్రయాణికులు మరణించగా, చాలా మంది గాయపడ్డారు.

    గురువారం మధ్యాహ్నం యూపీలోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు ట్రాక్‌లో లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకరోజు ముందుగానే ట్రాక్‌పై పనులు జరుగుతున్నందున, ప్యాసింజర్ రైళ్లు గంటకు 15-20కిలోమీటర్ల వేగంతో నడిచాయి. మరుసటి రోజు అదే స్థలంలో రైలు ప్రమాదానికి గురైంది.

    రైల్వే పత్రాల ప్రకారం, గోండా-మాన్కాపూర్ సెక్షన్‌లోని ట్రాక్‌ను మరమ్మతు చేయడానికి జూలై 17,2024 విజిలెన్స్ ఆర్డర్ జారీ అయ్యింది.

    ఇందులోభాగంగా రైళ్లను స్పీడ్‌గా అక్కడి నుంచి దాటించారు.ఆగస్టు 27, 2023-జూన్ 10, 2022న ఈ సెక్షన్‌పై విజిలెన్స్ ఆదేశాలు జారీ అయ్యాయి. రైళ్లు గంటకు 15 కిమీ వేగంతో నడిపారు.

    వివరాలు 

     రైలు పట్టాలు తప్పడానికి రెండు కారణాలు 

    రైల్వే ఇంజినీరింగ్ విభాగం ట్రాక్ రీప్లేస్‌మెంట్, రిపేర్ కోసం పై ఉత్తర్వులను జారీ చేస్తుంది.

    గురువారం ఎటువంటి విజిలెన్స్ ఆర్డర్ జారీ చేయకపోవడంతో, చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగంతో నడుస్తుండగా ప్రమాదానికి గురైంది.

    నిపుణుల అభిప్రాయం ప్రకారం, రైలు పట్టాలు తప్పడానికి రెండు కారణాలు మాత్రమే ఉన్నాయి.

    వీటిలో ప్రధానమైనవి ట్రాక్‌లో లోపాలు లేదా ఇంజిన్-కోచ్ చక్రాలలో లోపాలు. ఈ విభాగంలో గత మూడేళ్లుగా ట్రాక్ పనులు నిరంతరం జరుగుతున్నాయి.

    అందువల్ల ట్రాక్ లోపమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే దీనికి అసలు కారణం ఏంటన్నది రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్‌ఎస్) విచారణ తర్వాతే తేలనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్

    ఉత్తర్‌ప్రదేశ్

    Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి రాజస్థాన్
    Uttar Pradesh: నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసి.. టెర్రస్‌పై నుంచి తోసేసిన భార్య  భారతదేశం
    Sarvesh singh Died: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మృతి చికిత్స
    Naima Khatoon: AMU కొత్త వైస్ ఛాన్సలర్ గా నైమా ఖాతూన్ .. 100 సంవత్సరాలలో మొదటి మహిళా VC  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025