Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గీతం యూనివర్శిటీలో మెగా కెరీర్ ఫెయిర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలిపారు.
విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఫెయిర్‌లో 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీఏఎస్ కంపెనీలు పాల్గొననున్నాయి.
పదివేలకు పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని లోకేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
కెరీర్ ఫెయిర్ వివరాలు
తేదీలు: మార్చి 5, 6
రిజిస్ట్రేషన్ చివరి తేది: మార్చి 3
అర్హత: 2004 నుంచి 2025 వరకు పాస్ అవుట్ అయిన విద్యార్థులు
Details
యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ఈ మెగా కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు.
ముఖ్యమైన విషయాలు
తొలుత రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రాధాన్యం
ప్రముఖ కంపెనీలతో ఇంటర్వ్యూలకు అవకాశం
యువత తమ భవిష్యత్తును మెరుగుపరచుకునే చక్కని అవకాశం
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఈ ఫెయిర్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు మార్చి 3లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.