Special buses: మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజుల పాటు ప్రత్యేక బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శైవక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలకు భారీగా ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి 440 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయలు, బీరంగూడ, ఇతర శైవ క్షేత్రాలకు మొత్తం 440 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆయన తెలిపారు.
ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
Details
కీసరగుట్ట దారిలో ప్రత్యేక బస్సులు
సికింద్రాబాద్ నుంచి 90 బస్సులు
ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు నుంచి 100 బస్సులు
అమ్ముగూడ నుంచి 70 బస్సులు
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి 25 బస్సులు
మొత్తం కలిపి 285 ప్రత్యేక బస్సులు
ఇతర శైవక్షేత్రాలకు
సీబీఎస్ బస్టేషన్ నుంచి మెదక్ జిల్లా ఏడుపాయలకు 125 బస్సులు
పటాన్ చెరు నుంచి బీరంగూడకు 30 బస్సులు
మొత్తం 440 ప్రత్యేక బస్సులు
ప్రయాణికులకు ఏవైనా సందేహాలు ఉంటే 9959226160 (కోఠి), 9959226154 (రేతిఫైల్ బస్ స్టేషన్) నెంబర్లను సంప్రదించాలని సూచించారు.