Telangana: డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. వారికి ఇక పండగే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ,మహిళా సంక్షేమం కోసం కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్న హామీ ఇచ్చి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటిపై సంతకం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేయడం జరిగింది. తాజాగా డ్వాక్రా మహిళలకు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ, శుభవార్తను పంచారు.
పాలకుర్తిలో ఓ మహిళకు మొదటి ఎలక్ట్రిక్ ఆటో పంపిణీ
తెలంగాణ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలను అందించేందుకు సిద్ధమవుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు మొదటి ఎలక్ట్రిక్ ఆటోను పంపిణీ చేశారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు లేదా వారి కుటుంబంలో లైసెన్స్ ఉన్న వారికి ఈ ఆటోలు అందించనున్నారు. ఈ ఆటోలను ప్రభుత్వం స్త్రీనిధి రుణం ద్వారా కొనుగోలు చేసి ఇస్తోంది. అయితే రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా, ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుపై సర్కార్ అధ్యయనం చేస్తోంది. డ్వాక్రా మహిళలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు.
రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీ పథకాలపై విశ్వాసం ఉంచి, బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఆర్థికాభివృద్ధి పెంచేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.