
Dearness Allowance: ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరువు భత్యం (డీయర్‌నెస్ అలోవెన్స్, DA)ను 3 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్ బుధవారం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రతేడాది రెండుసార్లు కేంద్ర ఉద్యోగుల డీఏ సవరణ జరుగుతుంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పెంపు ద్వారా న్యాయం పొందుతారు.
Details
బోనస్ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
3 శాతం పెంపుతో ప్రస్తుతం 55 శాతం ఉన్న DA 58 శాతానికి చేరుతుంది. ఈ లాభం 49 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులకు దక్కనుంది. ఇక రైల్వే ఉద్యోగుల కోసం కూడా కేంద్ర క్యాబినెట్ బోనస్ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం 78 రోజుల వేతనాన్ని 'ఉత్పాదకతతో ముడిపడిన బోనస్' (PLB)గా చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందతారు.