Page Loader
Ponguleti Srinivasa Reddy: భూమిలేని రైతులకు శుభవార్త.. భూములకు హక్కు పట్టాలు పంపిణీ 
భూమిలేని రైతులకు శుభవార్త.. భూములకు హక్కు పట్టాలు పంపిణీ

Ponguleti Srinivasa Reddy: భూమిలేని రైతులకు శుభవార్త.. భూములకు హక్కు పట్టాలు పంపిణీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూముల్లేని నిరుపేద రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న అసైన్డ్ భూములపై సేద్యం చేస్తున్న రైతులకు హక్కుల పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు.

Details

ధరణి లోపాలు పునరావృతం కాకూడదు

ధరణి వ్యవస్థలో గతంలో ఎదురైన ఇబ్బందులు మళ్లీ తలెత్తకూడదని మంత్రి స్పష్టం చేశారు. భూముల రికార్డుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదని, చిన్న చిన్న భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. "రెవెన్యూ ఉద్యోగులు సరదాగా పనిచేయడానికి కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఉన్నారు. అలసత్వం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Details

రెవెన్యూలో సెలవులపై ఆంక్షలు 

ఈ క్రమంలో రెవెన్యూ శాఖ ఉద్యోగులకు సెలవులు ఇవ్వవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేయాలని తేల్చిచెప్పారు. గిరిజన రైతులకు పూర్తి రక్షణ గిరిజన రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయొద్దని మంత్రి హెచ్చరించారు. కొత్తగా ఏ చెట్టు నరకడం కూడా అనుమతించరాదని స్పష్టం చేశారు. "పోడు భూములపై ప్రభుత్వం క్లియర్ గా ఉంది. ఇకపై పోడు భూములపై విమర్శలు, బానర్ కథనాలు రావద్దు" అని పేర్కొన్నారు.

Details

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గట్టి హెచ్చరిక

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మంత్రి తీవ్ర హెచ్చరికలు చేశారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇళ్లకు 5 లక్షలు ఇవ్వడం లేదని, పేదవారికే ఇల్లు వస్తుందని స్పష్టం చేశారు. "పైరవీలకు తావులేదు. అనర్హులకు ఇల్లు మంజూరు చేస్తే సస్పెన్షన్ కాదు, అంతకన్నా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లంచం, అక్రమ రవాణాపై కఠిన వైఖరి "ఒక్క రూపాయి లంచం తీసుకున్నా సహించం. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడండి" అని అధికారులకు తెలిపారు. నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లకు అదనంగా ఐటిడిఎ పరిధిలో మ‌రిన్ని ఇళ్లు కేటాయించేందుకు ప్రణాళిక ఉందని వివరించారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ నిబద్ధతను, పేదల పట్ల కట్టుబాటును సూచిస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు.