
Telangana: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. పేదలకు నిత్యావరస సరుకుల కిట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని పేదలకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్‌ను అందించే కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఏప్రిల్‌లో ఉగాది రోజున అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన 'అమ్మ హస్తం' పథకానికి ఇదే మూలం.
ఆ సమయంలో పేదల కోసం తొమ్మిది ముఖ్యమైన ఆహార పదార్థాలను సబ్సిడీతో రూ.185కు అందించే ఈ పథకాన్ని అమలు చేశారు.
ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం "ఇందిరమ్మ అభయహస్తం" పేరుతో పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
Details
మంచినూనె, కందిపప్పు, పంచదార, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ
ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పేద కుటుంబాలకు మంచినూనె, కందిపప్పు, పంచదార, ఇతర నిత్యావసర సరుకులను అందించనున్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది.
నిన్న ఒక్కరోజే 8.30 లక్షల కుటుంబాలకు 17,311 రేషన్ షాపుల ద్వారా దాదాపు 18 వేల టన్నుల బియ్యం పంపిణీ చేశారు.
త్వరలోనే ఇందిరమ్మ అభయహస్తం పథకాన్ని కూడా అధికారికంగా ప్రారంభించే అవకాశముంది.