WhatsApp Governance: ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌కే పరీక్ష ఫలితాలు.. 2.0తో కొత్త సదుపాయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోంది.
ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉండగా, తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది.
ఈ మేరకు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
Details
కృత్రిమ మేధస్సుతో ఆధారిత సేవలు
నూతన వెర్షన్‌లో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఉదాహరణకు, ఒకచోట నుంచి మరో చోటకు టికెట్ కావాలని నోటితో చెబితే, టికెట్ బుక్ చేసేలా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అంతే కాకుండా కరెంట్ బిల్లు చెల్లింపు కూడా నంబర్ చెబితే పూర్తయ్యేలా రూపొందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు సులభతర సేవలు
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ పరీక్షా ఫలితాలను నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు పంపించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
ఇప్పటికే హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా జారీ చేస్తున్నామని, ఇకపై పరీక్షా ఫలితాలను కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని వెల్లడించారు.
Details
ఫిర్యాదుల స్వీకరణ, విస్తృత సేవలు
ప్రజలకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
జనవరి 30 నుంచి 155 సేవలు అందుబాటులోకి తెచ్చామని, ప్రస్తుతం 200 సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మార్చి చివరినాటికి 300, జూన్ 30 నాటికి 500 సేవలను అందించనున్నట్లు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో ప్రజలు కోరిన సేవను 10 సెకన్లలో అందించేలా ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.
టీటీడీ సేవలు, శాశ్వత ధృవీకరణ పత్రాలు
మరో నెలలో టీటీడీ సేవలు కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి రానున్నాయని, సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా చెల్లుబాటయ్యేలా చట్టసవరణ చేపడతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
Details
సైబర్ భద్రత, గోప్యత
ప్రజల డేటాకు ఎటువంటి ప్రమాదం ఉండదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్‌క్రిప్షన్, ఆధార్ ఎనేబుల్డ్ ఓటీపీ వ్యవస్థతో భద్రతను పెంచినట్లు వివరించారు.
హ్యాకింగ్‌కు గురైనట్లు నిరూపిస్తే రూ.10కోట్లు బహుమతిగా ఇస్తానని సవాల్ విసిరారు.
ప్రత్యర్థులపై సెటైర్లు
ప్రతిపక్ష నేత జగన్‌కు ఫోన్ లేదని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఓ ఫోన్ కొనిచ్చి పంపాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేర్చుకుంటారేమోనని సెటైర్లు పేల్చారు.
ప్రత్యర్థి రాష్ట్రాల పోటీ
వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మహారాష్ట్ర కూడా స్వీకరించిందని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ సేవలపై ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరణ పత్రాలను శాశ్వతంగా అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.