Half Day Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వచ్చే మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ ప్రక్రియ విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించనుంది. మార్చిలో పరీక్షలు ప్రారంభమయ్యే క్రమంలో వాతావరణం మరింత వేడెక్కనుంది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఒంటిపూట బడులు నిర్వహించడంతో విద్యార్థులు ఎండల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది.
Details
35 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్క్‌ను దాటుతున్నాయి.
దీంతో ఒంటిపూట బడులను అనుమతించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక రాష్ట్రంలో వాతావరణం మారునుందనే అంచనాలున్నాయి.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు వర్ష సూచన కూడా ఉంది.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.