Page Loader
JNTU Hyderabad: విద్యార్థులకు శుభవార్త.. ప్రతి నెలా నాలుగో శనివారం హాలిడే!
విద్యార్థులకు శుభవార్త.. ప్రతి నెలా నాలుగో శనివారం హాలిడే!

JNTU Hyderabad: విద్యార్థులకు శుభవార్త.. ప్రతి నెలా నాలుగో శనివారం హాలిడే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, కార్యాలయాలకు ప్రతి నెలా 4వ శనివారం సెలవుగా ప్రకటించింది. ఈ ప్రకటనను ఫిబ్రవరి 20న జారీ చేసిన కొత్త వీసీ కిషన్ కుమార్ రెడ్డి, 2008కి ముందు అమలులో ఉన్న సెలవు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు ఈ మార్పును పరిగణనలోకి తీసుకుని, అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా ప్రకటన ఫిబ్రవరి 22 నుండి అమల్లోకి రానుంది. 2008కి ముందు ఇదే విధానం కొనసాగింది. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల రద్దయింది. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించడంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.