LOADING...
T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు

T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఆదివారం (మార్చి 8)న అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ వేదిక స్టేడియంలో తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం నార్త్ రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఆలస్యంగా విడుదల కావడంతో అనేక మంది క్రికెట్ అభిమానులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. మరోవైపు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నార్తర్న్ రైల్వే న్యూదిల్లీ నుంచి సబర్మతి వరకు ప్రత్యేక రైలును నడిపేందుకు నిర్ణయించింది.

Details

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్

04062 ట్రైన్ నంబర్ కలిగిన ఈ ప్రత్యేక రైలు నేడు (మార్చి 7) రాత్రి 11:45 గంటలకు న్యూదిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి, మార్చి 8 మధ్యాహ్నం 2:30 గంటలకు సబర్మతి రైల్వే స్టేషన్ కు చేరుకోనుంది. ఈ రైలు ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, గురుగ్రామ్, జైపూర్ మార్గంగా ప్రయాణిస్తుంది. మొత్తం 19 కోచ్‌లు ఉండగా, అందులో థర్డ్ AC, సెకండ్ AC కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉంటే, భారత జట్టు ఇప్పటికే శుక్రవారం రోజే అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనుంది.

Details

ప్రాక్టీస్ లో మునిగిపోయిన ఇరు జట్లు

మరోవైపు న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధన చేయనుంది. అలాగే న్యూజిలాండ్ జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుండగా, భారత జట్టు మీడియా సమావేశం మాత్రం ప్రాక్టీస్ ప్రారంభానికి 15 నిమిషాల ముందు నిర్వహించనున్నారు. చరిత్ర పరంగా చూస్తే, టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌ను ఒక్కసారి కూడా ఓడించలేదు. అంతేకాకుండా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా నిలవడం, అలాగే స్వదేశంలోనే టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించడం భారత జట్టు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement