LOADING...
TG News: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు

TG News: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. నిన్న రాష్ట్రానికి 9,000 టన్నుల యూరియా సరఫరా అయిందని, ఇవాళ రాత్రి లోపు అదనంగా 5,000 టన్నుల యూరియా చేరనుందని పేర్కొన్నారు. అలాగే, వచ్చే వారంలో మొత్తం 27,470 టన్నుల యూరియా రాష్ట్రానికి అందనుందని అధికారులు తెలిపారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోవకుండా సమయానికి సరైన పంపిణీ జరిగేలా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు కట్టుబడి ఉండాలని సూచించారు. వరదల వల్ల కలిగిన పంటనష్టంపై 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణలో యూరియా సరఫరా,పంట నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు