తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో చదవుతున్న విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలు భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధింత మంత్రులు ప్రతిపాదనలను రూపొందించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు.
3వ తరగతి నుంచి 7వ తరగతి వారికి రూ.12వందలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.14వందలు, ఇంటర్ విద్యార్థులకు రూ.1,875 డైట్ ఛార్జీలను పెంచాలని మంత్రులు సూచించారు.
తెలంగాణ
దాదాపు 25శాతం పెరిగిన డైట్ ఛార్జీలు
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డైట్ ఛార్జీల అంశాన్ని లేవనెత్తారు. సీఎం కేసీఆర్ దీనిపై స్పందించి డైట్ ఛార్జీలు పెంచుతామని హామీ చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదలను సిద్ధం చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు.
హామీ మేరకు సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీల పెంపుపై బుధవారం ఉన్నతాధికారులతో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. ఈ మేరకు సంక్షేమ హాస్టళ్ల తీరుపై ఆరా తీశారు.
ఇతర రాష్ట్రాల కంటే డైట్ ఛార్జీలు ఎక్కువగా ఉండాలని ఈ మేరకు మంత్రులు నిర్ణయించి, దాదాపు 25శాతం పెంచారు.