Page Loader
Free Bus: మహిళలకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం

Free Bus: మహిళలకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2024
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మహిళలకు త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్టు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతి పండుగకు ముందుగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు కింద ఇప్పటికే పెన్షన్లు పెంచామని, దీపం పథకాన్ని కూడా ఇవాళ ప్రారంభించామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Details

విమర్శించే హక్కు జగన్ కు లేదు

తల్లికి, చెల్లికి కూడా న్యాయం చేయలేని జగన్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని పేర్కొన్నారు. జగన్ రెండు రోజులు రాష్ట్రంలో ఉండి, మిగిలిన ఐదు రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటారని ఎద్దేవా చేశారు.