Page Loader
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరోసారి పరీక్ష నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
మరోసారి పరీక్ష నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరోసారి పరీక్ష నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 07, 2023
07:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులుగా మంత్రి వర్గ సభ్యులు నిర్ణయించారు. రాష్ట్రంలో చివరిసారిగా గత ఏడాది జూన్‌ 12న విద్యాశాఖ టెట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో విద్యాశాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. ఈ నేపథ్యంలోనే టీచర్‌ పోస్టుల భర్తీ, మన ఊరు-మన బడి పనుల పురోగతిపై చర్చించింది.

DETAILS

డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌ ఉత్తీర్ణుత సాధిస్తేనే టీఆర్‌టీకి అర్హత

ఏడాది కాలంలో డీఈడీ, బీఈడీ పాసైన వారు దాదాపు 20 వేలకుపైగా ఉంటారని అంచనా. గత కొంతకాలంగా మరో టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్షను పెట్టాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. అయితే ఈసారి నిర్వహించనున్న పరీక్షకు దాదాపు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌ ఉత్తీర్ణుత సాధిస్తేనే ఉపాధ్యాయుల నియామకానికి ఉద్దేశించిన టీఆర్‌టీ రాసేందుకు అర్హులు. టెట్‌ మార్కులకు, టీఆర్‌టీ ర్యాంకింగ్స్ లో 20 శాతం మేర వెయిటేజీ ఉంది. ఈ కారణంగానే టెట్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది.

DETAILS

రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటికీ 3 సార్లు పరీక్ష నిర్వహించిన సర్కార్

ఒకవేళ టెట్ లో అర్హత లేకపోతే ఈ పరీక్షలకు హాజరుకావడం కుదరదు.టెట్ ఉత్తీర్ణత సాధించలేకపోతే ప్రైవేట్ లోనూ బోధనకు వీల్లేదు. రాష్ట్రం ఏర్పాటయ్యాక మూడు సార్లు టెట్ ఎగ్జామ్స్ నిర్వహించారు. 1. 2016 మే 22 2. 2017 జులై 23 3. 2022 జూన్‌ 12 మరో నెలతో ఏడాది గడుస్తున్నందున మళ్లీ టెట్‌ నిర్వహించాల్సి ఉంది.హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.