Page Loader
Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా
రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా

Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన శనివారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌కు సమర్పించారు. రాజీనామా అనంతరం విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పుతున్నట్లు ప్రకటించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం రాజీనామా చేయలేదని ఆయన తెలిపారు. వైఎస్ కుటుంబానికి నిత్య రుణపడి ఉంటానని చెప్పిన విజయసాయి రెడ్డి, రెండుసార్లు రాజ్యసభకు పంపించిన జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Details

చంద్రబాబుతో విభేదాలు లేవు

ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తనకు ప్రోత్సాహం అందించి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో తాను రాజకీయ విభేదాలు ఉన్నా చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో తనకు చిరకాల స్నేహం ఉందని అన్నారు. తాను ఇక భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తానని విజయసాయి రెడ్డి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనను ఆదరించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.