Telangana High Court: కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరు: హైకోర్టు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరని తెలంగాణ హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించిన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే, సుదీర్ఘ జాప్యం తర్వాత గవర్నర్ సిఫార్సును తిరస్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది. తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దన్నహైకోర్టు
అయితే ఇద్దరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇంతలో ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు వెంటనే గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. అయితే దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ తెలంగాణ హైకోర్టులో దీనిని సవాలు చేశారు. దీంతో దాసోజు శ్రవణ్,సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దని హైకోర్టు ఆదేశించింది.
సందిగ్ధంలో నలుగురు అభ్యర్థుల భవితవ్యం
తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. గురువారం నాడు, హైకోర్టు తన తీర్పులో "ఆర్టికల్ 171 (5) ప్రకారం, కేబినెట్ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని భావించింది. దీంతో మొత్తం నలుగురు అభ్యర్థుల భవితవ్యం సందిగ్ధంలో పడింది. మరి, కోర్టు తీర్పుపై స్పష్టత వస్తే తుది ఫలితం తేలనుంది.